భారత్ అంటే... అతిపెద్ద గణతంత్ర రాజ్యం అని తెలుసు. భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరని తెలుసు. కానీ, మనలో చాలామందికి తెలియని ఇంకా ఎన్నో ఎన్నో ప్రత్యేకతల కలయికే భారత్. మన గొప్పతనాన్ని మనమూ ఓసారి మననం చేసుకుందామా మరి.
చంద్రుడి మీద నీరుందని మొదట గుర్తించింది మనదేశమే. ఇస్రో చంద్రయాన్-1 ఈ విషయాన్ని కనుగొంది.
* 2500 సంవత్సరాల కిందటే మనదేశంలో ఆయుర్వేద పాఠశాలలున్నాయి. భూమ్మీద మొదటి వైద్య పాఠశాలలు ఇవే.
* ఎంతో ప్రాచుర్యంపొందిన కాటరాక్ట్, ప్లాస్టిక్ సర్జరీలను ప్రపంచానికి పరిచయం చేసింది మనదేశమే. క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలోనే మన దేశానికి చెందిన శుశ్రుతుడూ చరకుడూ ఈరకం చికిత్సలు చేశారట.
* మన దేశంలో జరిగే కుంభమేళా అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తుంది. దాదాపు పది కోట్ల మందికి పైగా పాల్గొనే ఈ కార్యక్రమం ప్రపంచంలోనే ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యే వేడుక.
* 2006లో రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లారు. భారత రాష్ట్రపతి ముప్పయ్యేళ్ల తర్వాత ఆ దేశానికి వెళ్లడంతో భారత మిస్సైల్ ప్రోగామ్ పితామహుడైన కలాంను గౌరవించేందుకుగానూ స్విస్ ప్రభుత్వం ఆయన వెళ్లిన మే 26ను సైన్స్‌డేగా ప్రకటించింది.
* తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయం ప్రపంచంలోనే మొదటి గ్రానైట్ గుడి.
* తలస్నానానికి షాంపూని వాడడం మన నుంచే ఇతర దేశాలవారికి తెలిసింది. 16వ శతాబ్దంలోనే కుంకుడుకాయలు, ఉసిరి పొడి, మందారాలను ఉడికించి మనదేశంలో షాంపూల్ని తయారు చేసేవారు. తర్వాతి కాలంలో ఆంగ్లేయుల ద్వారా అది విదేశాలకు పాకింది. షాంపూ అన్నపదం కూడా సంస్కృత పదం చాంపూ నుంచి వచ్చిందే.
* 1948లో నోబెల్ శాంతి బహుమతిని ఎవరికీ ఇవ్వలేదు. అందుక్కారణం ఆ ఏడాది ఆ పురస్కారాన్ని మహాత్మాగాంధీకి ఇవ్వాలనుకున్నారు. కానీ ఆయన చనిపోవడంతో బాపూజీకి గౌరవసూచకంగా ఆ సంవత్సరం దాన్ని ఎవరికీ ఇవ్వలేదు.
* బాంద్రా-వర్లీ సముద్ర వంతెనకోసం ఏర్పాటుచేసిన స్టీలు వైర్ల పొడవు భూమి చుట్టుకొలత మొత్తానికీ సమానమట. ఈ వంతెన నిర్మాణానికి 2,57,00,000ల పని గంటల్ని వెచ్చించారట.
* భారత పురుషుల కబడ్డీ జట్టు ఇప్పటివరకూ అన్ని ప్రపంచకప్‌లనూ గెలిచింది.
* పంచదారను కనిపెట్టి, ఉపయోగించిన మొదటిదేశం భారతదేశమే. మిగిలిన ప్రపంచం దాన్ని తెలుసుకుందీ నేర్చుకుందీ మన నుంచే. వైకుంఠపాళి, యుద్ధకళలు పుట్టింది భారత్‌లోనే. షర్టు గుండీలూ స్కేలూ సున్నానీ కనిపెట్టింది కూడా మనమే.
*1936లో బెర్లిన్ ఒలింపిక్స్‌లో జర్మనీని 8-1 తేడాతో ఓడించింది భారత హాకీజట్టు. ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మేజర్ ధ్యాన్‌చంద్‌కి అడాల్ఫ్ హిట్లర్ కూడా అభిమాని అయిపోయాడు. అతడికి జర్మన్ పౌరసత్వమూ మిలటరీలో ఉన్నత స్థాయి ఉద్యోగంతో పాటు తమదేశం తరఫున హాకీ ఆడే అవకాశం ఇస్తానంటూ ఆహ్వానించాడట హిట్లర్. ధ్యాన్‌చంద్ అందుకు ఒప్పుకోకపోవడం అతడి దేశభక్తికి నిదర్శనం.
* ప్రపంచానికి వజ్రాల గురించి తెలిసింది కూడా భారత్ ద్వారానే. వజ్రాలు మొదట కృష్ణా, గోదావరి, పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రమే దొరికేవి మరి. 18వ శతాబ్దంలో బ్రెజిల్‌లో వజ్రాల గనులు బయటపడేవరకూ ప్రపంచం మొత్తానికీ వజ్రాలను అందించింది భారత్ మాత్రమే.
* ఆంగ్లం ఎక్కువ మంది మాట్లాడే దేశాల్లో అమెరికా తర్వాతి స్థానం భారత్‌దే.
* తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై అంత్యక్రియలకు 1.5 కోట్లమంది హాజరయ్యారు. అంత్యక్రియలకు అంతమంది రావడం ప్రపంచ చరిత్రలో అదే తొలిసారి.
*ప్రపంచవ్యాప్తంగా వాడే సుంగంధద్రవ్యాల్లో అత్యధిక శాతం వాటిని ఉత్పత్తి చేసేదీ ఎగుమతి చేసేదీ మన దేశమే. పాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం కూడా భారతదేశమే.
* యూఎస్‌బీ... ప్రపంచ సాంకేతిక రంగం గతిని మార్చిన అద్భుత పరికరం. భారతీయ కంప్యూటర్ ఆర్కిటెక్ట్ అయిన అజయ్ వి.భట్ దీన్ని కనుగొనడంలో కీలకపాత్ర పోషించారు.
* ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ది రెండోస్థానం.
* మహారాష్ట్రకు చెందిన శ్రీకాంత్ జిచ్‌కర్ ‘మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ ఆఫ్ ఇండియా’గా పేరుపొందాడు. ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎంపికకావడంతోబాటు, లా, వైద్యశాస్త్రం, ఫొటోగ్రఫీ, ఎంబీఏ, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం... ఇలా 20 రకాల డిగ్రీలను అందుకున్నాడు. చదవడమే కాదు, చాలా డిగ్రీల్లో గోల్డ్‌మెడల్స్‌నూ పొందాడు. సంస్కృతంలో డాక్టరేట్ కూడా సాధించాడు. అంతేకాదు, 25ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మంత్రిగానూ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు. ఈయన 49 ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో మరణించాడు.
* మానవ కంప్యూటర్‌గా బెంగళూరుకి చెందిన శకుంతలాదేవి 1982లో గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. 7,686,369,774,870, 2,465,099,745,779 సంఖ్యలను గుణించి 28సెకన్లలో సరైన సమాధానం చెప్పిందామె.
* ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్ నెట్‌వర్క్ భారత్‌లోనే ఉంది. ఎన్నో ప్రతిభల కలబోత భారత్ కాబట్టే, ప్రతి సంవత్సరం గిన్నిస్ రికార్డులకోసం దరఖాస్తు చేసే దేశాల్లో మనదేశం మూడో స్థానంలో ఉంటోందట.
* ఎన్నో ప్రతిభల కలబోత భారత్ కాబట్టే, ప్రతి సంవత్సరం గిన్నిస్ రికార్డులకోసం దరఖాస్తు చేసే దేశాల్లో మనదేశం మూడో స్థానంలో ఉంటోందట. మేరా భారత్ మహాన్..!