Sunday, 4 December 2016

గాల్లో తేలినట్లుండే.. కొత్త తరహా సెల్ఫీ


సెల్ఫీలు తీసుకోవడానికి    ఇక సెల్ఫీ స్టిక్‌ అవసరం లేదు. సెల్ఫీల కోసం ఫోన్‌ను చేతితో పట్టుకొని ఇబ్బందులు పడాల్సిన పనీ లేదు. ఎందుకంటే గాలిలో తేలియాడే అతిచిన్న సెల్ఫీ డ్రోన్లను తాజాగా ఆవిష్కరించారు. ఇవి ఎంచక్కా గాల్లో తిరుగుతూ మీకు కావల్సినట్లు సెల్ఫీలను, వీడియోలను తీసిపెడతాయి. 
సింపుల్‌గా ‘ఎయిర్‌ సెల్ఫీ’గా పిలుచుకునే ఈ డివైజ్‌.. ప్యాకెట్‌ పరిమాణంలో ఉండే ఫ్లైయింగ్‌ కెమెరా. ఇందులో నాలుగు ప్రొపెల్లర్స్‌, 5 ఎంపీ కెమెరా ఉంటుంది. వైఫైతో స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకోవడం ద్వారా ఇది పనిచేస్తుంది. ప్రముఖ కంపెనీ ఫోన్లంటికీ ఇది సపోర్టు చేస్తుంది. 260 ఎంఏహెచ్‌ బ్యాటరీతో, వీడియోలు, ఫొటోలు స్టోర్‌ చేసుకోవడానికి 4జీబీ మెమొరీ కార్డుతో ఇది లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే మూడు నిమిషాలపాటు గాల్లో ఎగురుతుంది. దీనికి సంబంధించిన యాప్‌ను స్మార్ట్‌ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకొని అందులోని రిమోట్‌ ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. ఇక మనకు కావాల్సిన సెల్ఫీలు, వీడియోలను ఎలాంటి ప్రదేశాల్లోనైనా ఎంచక్కా, ఇబ్బందులు లేకుండా ఈ ఎయిర్‌సెల్ఫీతో తీసుకోవచ్చు. 
సెల్ఫీ స్టిక్‌ అవసరం లేకుండా అన్ని కోణాల్లో, అన్ని ప్రదేశాల్లో వీడియోలు, సెల్ఫీలు తీసుకోవడానికి వినూత్న ఆలోచనతో దీన్ని రూపొందించామని ఎయిర్‌సెల్ఫీ సహ వ్యవస్థాపకుడు స్ట్రోపియానా తెలిపారు. వినియోగదారుల నుంచి ప్రీ ఆర్డర్లను స్వీకరిస్తున్నారు. వచ్చే మార్చినాటికి ఇది మార్కెట్‌లోకి రానుంది.

No comments:

Post a Comment