గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదల
It seems like a mix of Troy, Narnia and 300, given the size of the army and the wars fought on wild sands, soft grass and battleships respectively.
As Nandamuri Balakrishna places all his bets on his much-awaited 100th film Gautamiputra Satakarni, the filmmakers pushed out the trailer of the film amid a huge fan presence and pooja in Karimnagar on Friday.
With the 2.20-minute trailer, it is clear that Balayya aka Satakarni is on an A-rush as he draws his sword ruthlessly while on a horseback once the war horn has been sounded. Lacing his wit with the usual dose of power-packed rhetoric, his glaring eyes and an extended horseshoe moustache, Balakrishna somehow seems to fit in the shoes of the Satavahana warrior Gautamiputra Satakarni as his mien and voice compensated for his physique. You cannot miss the scene where he tears open his chest armour.
Talking about the sets, it seems like a mix of Troy, Narnia and 300, given the size of the army and the wars fought on wild sands, soft grass and battleships respectively.
Though there are a lot of action-heavy shots, equal space has been given to Balayya romancing Shriya Saran. We see about seven different frames of it, which seemed quite a lot for a trailer. In addition, a couple of shots were spared for the dream girl Hema Malini too.
Joining in the list of epic war films, the movie is based on the life history of a warrior of the Satavahana empire in the second century CE, Gautamiputra Satakarni. From war sequences to sets, the film is said to pack high-octane stunts and visual effects. The fandom will get a glimpse of four wars with close to 1000 Satavahana and Greek soldiers who will be battling with 300 horses and 20 chariots in scenic locations of Mount Kazbek in Georgia and in Morocco.
With all this packed in the movie, let us wait for Sankranthi and see how this film could be a game-changer for Balakrishna.
గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ విడుదల
కరీంనగర్: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రచార చిత్రం విడుదల శుక్రవారం సాయంత్రం కరీంనగర్ పట్టణంలో వేడుకగా జరిగింది. బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య ఈ ట్రైలర్‌ను తిరుమల థియేటర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. ‘మైక్ పట్టుకుంటే ఈ సినిమా గురించి చెప్పకుండా ఆగలేం. ఈ ట్రైలర్ చూడాలి. 100వ చిత్రాన్ని ఈ యూనిట్‌లో ఎందుకు పెట్టారో అర్థమవుతుంది. కోటి రతనాల వీణ తెలంగాణ. ఇక్కడి కోటిలింగాల సాక్షిగా నందమూరి అందగాడు బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి ట్రైలర్ విడుదల చేస్తున్నాం’ అని అన్నారు.
‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ట్రైలర్‌కు పదిలక్షల (1మిలియన్) వ్యూస్ లభించాయి.ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ మార్క్ చేరుకోవడం విశేషం.
‘‘మనకంటూ ఓ దేశాన్ని... ఒక చరిత్రని... ఒక వారసత్వాన్ని... గౌరవాన్ని తెచ్చిపెట్టిన శక పురుషుడు గౌతమిపుత్ర శాతకర్ణి వీరగాథలో నటించడం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు నందమూరి బాలకృష్ణ.
బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘శాతవాహనుల సింహ ద్వారం కోటిలింగాల. శాతకర్ణి తల్లి గౌతమి పుట్టింది ఇక్కడే. ఈ గడ్డపై మా సినిమా ప్రచార చిత్రం విడుదల కావడం ఆనందంగా ఉంది. ఎలాంటి కథలో నటించాలా అని వందో చిత్రం గురించి సతమతమవుతున్న సమయంలో దర్శకుడు క్రిష్ నాకు ఈ కథ చెప్పారు. శాతకర్ణికి సంబంధించిన చరిత్ర కూడా మన దగ్గర లేదు. గుంటూరుకు చెందిన పరబ్రహ్మశాస్త్రిగారు పరిశోధన చేసి శాతవాహనులు తెలుగువాళ్లని నిరూపించారు. ఆయనకి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆ చరిత్ర నేపథ్యంలోనే క్రిష్ ఓ మంచి కథని సిద్ధం చేసుకొని నన్ను కలిశారు. సాంఘిక, జానపద, చారిత్రక, పౌరాణిక... ఇలా అన్ని రకాల చిత్రాల్లోనూ నేను నటించా. నా దృష్టిలో మూడే శకాలు. ఒకటి శాలివాహన శకం, మరొకటి స్వాతంత్రోద్యమం, మరొకటి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం. జంబు ద్వీప కాలమాన పట్టిక ప్రకారం శాతకర్ణి సింహాసనం అధిష్ఠించినరోజే ఉగాది పండుగని చేసుకొంటున్నాం. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా శాతకర్ణిని తలచుకొని ఆ పండుగని జరుపుకొంటారు. ఇలా చరిత్రను చాటిచెప్పే చిత్రాలెన్నో అప్పట్లో నాన్నగారు ఎన్టీఆర్ చేశారు. అలాంటి ఓ మహానటుడికి వారసుడిగా నా కర్తవ్యంగా భావించే ఈ సినిమా చేశా. శాతకర్ణి, గాంధీజీ, ఆదిశంకరాచార్యులు, అంబేడ్కర్, ఎన్టీఆర్‌లాంటి యుగ పురుషులకి చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. పుట్టిన వూరు, ప్రాంతం, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి జన్మకి సార్థం చేకూర్చుకున్నారు. నేను నాన్నగారి అడుగుజాడల్లోనే నడుస్తున్నా. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. సాయిమాధవ్ అద్భుతమైన సంభాషణలు రాశారు. నిజానికి ఇంతటి చారిత్రక కథాంశాన్ని చిత్రీకరించాలంటే రెండేళ్లు పడుతుంది. కానీ మంచి సంకల్ప బలంతో మొదలెట్టిన ఈ చిత్రానికి ఎక్కడా చిన్న ఆటంకం కూడా ఎదురు కాలేదు. ప్రకృతి కూడా మా సినిమా చిత్రీకరణకు సహకరించింది’’ అన్నారు. అనంతరం చిత్రంలోని సంభాషణలు చెప్పి సభికుల్ని అలరించారు బాలకృష్ణ. దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ ‘‘బాలకృష్ణ శౌర్యం, యుద్ధ విన్యాసాలతో సింహం బిరుదును సార్థకం చేసుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి రెండు వేల సంవత్సరాల క్రితం శత్రు దేశాలకు సింహస్వప్నం అయితే, ఈ సినిమాకు నిజమైన సింహం బాలకృష్ణ’’ అన్నారు. చిత్ర మాటల రచయిత సాయిమాధవ్ మాట్లాడుతూ ఈ సినిమాకు మాటలు రాయడమంటే వంద సినిమాలకు రాస్తున్నట్లుగా భావించి పనిచేశానన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల తెదేపా అధ్యక్షులు విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ, నిర్మాతలు రాజీవ్‌రెడ్డి, బిబో శ్రీనివాస్, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు...: గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ఆవిష్కరణను పురస్కరించుకొని శుక్రవారం ఆయన శాతవాహనుల తొలి రాజధాని అయిన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాలను సందర్శించారు. చిత్ర బృందంతో కలిసి కోటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో బాలకృష్ణ విలేకరులతో మాట్లాడారు. కోటేశ్వరస్వామి కొలువైన గడ్డపై పుట్టిన గౌతమిపుత్ర శాతకర్ణి భారతదేశాన్ని ఐక్యం చేసి విదేశీయుల మీద దండయాత్ర చేశారన్నారు. ఆయన వెంట దర్శకులు క్రిష్, రచయిత సాయిమాధవ్ తదితర చిత్ర బృందం ఉన్నారు.
తన బాబాయ్ నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం ట్రైలర్‌ను ఉద్దేశించి హీరో ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం ట్రైలర్ అద్భుతంగా ఉందన్నారు.
No comments:
Post a Comment