Saturday, 3 December 2016

ఆ పట్టణంలో 2017లో సూర్యుడు ఉదయిస్తాడట!



సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సాయంత్రం పడమరన అస్తమిస్తాడు. ఇదీ ప్రతీరోజు జరిగేదే. కానీ అమెరికాలోని ఓ పట్టణంలో మాత్రం కొన్ని రోజుల క్రితం అస్తమించిన సూర్యుడు మళ్లీ వచ్చే ఏడాదిలోనే ఉదయిస్తాడట.
బారో పట్టణం అమెరికా ఉత్తర భాగంలోని అలస్కా ప్రాంతంలో ఉంది. భూభ్రమణంలోని అసాధారణ చర్యల వల్ల ఈ ప్రాంతంలో చీకట్లు కమ్ముకుంటాయి. నవంబర్‌ 18న సూర్యుడు ఈ ప్రాంతంలో అస్తమించాడు. భూమి.. ఉత్తరార్థగోళం సూర్యుడికి దూరంగా జరగడంతో ఉత్తర ప్రాంతంలో చీకట్లు కమ్ముకున్నాయి. అయితే.. బారో పట్టణంలో దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. భూమి మళ్లీ సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు.. అంటే 2017 జనవరి 22న ఈ పట్టణం సూర్యోదయాన్ని చూడబోతుంది.
అప్పటి వరకు ఈ పట్టణంలో సూర్యకాంతులు ఉండవు. పగటిపూట మాత్రం కొన్ని గంటలపాటు మాత్రమే వెలుతురు ఉంటుందట. ఆ తర్వాత మళ్లీ చీకటైపోతుంది. ఈ సమయంలో ఆ పట్టణాన్ని ‘అట్కియగ్విక్‌’గా పిలుస్తుంటారు.

No comments:

Post a Comment