నందికి నటనకి సంబంధం ఏమిటో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమాలకి నంది అవార్డులు ఇస్తుంటుంది. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ ప్రభుత్వం తాము ఇచ్చే అవార్డులకి వేరొక పేరు సూచించమని విశ్రాంత ఐఏఎస్ అధికారి రమణాచారి అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ ఆరు నెలలు చర్చించి, నిన్ననే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నంది అవార్డుల స్థానంలో సింహం అవార్డులు ఇవ్వాలని కమిటీ రికమెండ్ చేసింది. నందికి నటనకి సంబంధం లేనట్లే, సింహానికి నటనకి కూడా ఎలాంటి సంబంధం లేదు.
కాకపొతే ముఖ్యమంత్రి కేసిఆర్ నరసింహ స్వామి భక్తుడు కాబట్టి, సింహం అవార్డులు బాగుంటాయని అనుకున్నారో, లేక శివుడి వాహనం నంది, అమ్మవారి వాహనం సింహం కాబట్టి సింహం అవార్డులు అనుకున్నారో తెలియదు. ఇక, ఈ కమిటీ కెసిఆర్ కు ఎన్టీఅర్ పై ఉన్న అభిమానాన్ని గమనించి, జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డ్ ని ఎన్టీఆర్ పేరు మీద ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణ నటులు కాంతారావు, ప్రభాకర్ రెడ్డిల పేరుమీద కూడా అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇంకా ఆసక్తికరమైన నిర్ణయం ఏమిటంటే, తెలుగు సినిమాలు, తెలంగాణ సినిమాలని రెండు కేటగిరిలు తీసుకొస్తున్నారు. ఏ ప్రాంతం నటీనటులు దర్శకులు తీసిన తెలుగు సినిమాలైనా తెలుగు కేటగిరీలో అవార్డ్ ఇస్తారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నటీనటులు దర్శకులు చేసిన సినిమాలకి ఆ కేటగిరీలో అవార్డ్స్ ఇస్తారు. మొత్తానికి అన్నీ బాలన్స్ చేసుకుంటూ రమణాచారి కమిటీ మంచి రిపోర్ట్ ఇచ్చింది.
No comments:
Post a Comment