రిలయన్స్ జియో సిమ్‌తో వీలు
4 నెలల పాటు కాల్స్, డేటా ఉచితం
4జీలో రిలయన్స్‌ది విప్లవమే. అంతా ఉచితమేనంటూ దాదాపు మూడు నెలల క్రితం సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. తాజాగా మరో ఆఫర్‌తో ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆఫర్ ప్రకారం కాల్స్, డేటా, వీడియో ఉచిత సేవలు 2017 మార్చి ఆఖరు వరకు అందుబాటులో ఉంటాయి జియో సిమ్‌ను వినియోగించుకునేందుకు 4జీ వీఓఎల్‌టీఈ సాంకేతికత కలిగిన స్మార్ట్ ఫోన్లే కాదు.. ఇంటిలో ఉండే ల్యాండ్‌ఫోన్ కూడా విడుదలైంది. ఇప్పటికే ఈ ఫోన్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తమ ఖాతాదార్లకు అందిస్తోంది కూడా.

రిలయన్స్ జియో సిమ్‌కార్డు ఉంటే కాల్స్ అన్నీ మార్చి వరకు ఉచితమే. డేటా కూడా రోజుకు 1 జీబీ వరకు వాడుకోవచ్చు. కోరుకున్న వీడియోలు చూసుకోవచ్చు. ఇవన్నీ ల్యాండ్‌లైన్ ఫోన్‌లా ఉండే వైర్‌లైస్ ఫోన్‌తోనే వినియోగించుకోగలిగే సౌలభ్యం కలుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ వైబ్రిడ్జ్ నెట్‌వర్క్ సొల్యూషన్స్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్‌లోని హాట్‌స్పాట్ సాయంతో దాదాపు 8 పరికరాల వరకు అనుసంధానించుకోవచ్చు. ఈ ఫోన్‌కుండే యాంటెన్నా, 4జీ ఎల్‌టీఈ సిగ్నల్స్‌ను అందుకుకోవడమే కాదు, వైఫై రూటర్‌గా పనిచేస్తుంది. ఈ ఫోన్ తెరపై వీడియోలు కూడా చూసుకునే వీలుంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే ఈ ఫోన్ నుంచి ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు. ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్స్‌లకూ అవకాశం ఉంటుంది. ఈ ఫోన్‌ను ఇల్లు, కార్యాలయం, దుకాణంలో ఏర్పాటు చేసుకుంటే, రిలయన్స్ జియో కనెక్షన్ సాయంతో వచ్చే ఏడాది మార్చి ఆఖరు వరకు ఉచితంగా కాల్స్, డేటా సేవలు పొందొచ్చు. ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.
No comments:
Post a Comment