Friday, 2 December 2016

ఈ ఏడాది టాప్‌ యాప్‌లివే!

ఇంటర్నెట్‌డెస్క్‌: కాలచక్రం గిర్రున తిరిగింది. మొన్నీమధ్యే వచ్చినట్లు అన్పిస్తున్న ఏడాది అప్పుడే ఆఖరికి వచ్చింది. ప్రతీ సంవత్సరంలాగే ఈ ఏడాది గూగుల్‌ఇండియా తన ప్లేస్టోర్‌లో 2016లో వివిధ విభాగాల్లో ట్రెడింగ్‌లో నిలిచిన టాప్‌ ఐదు యాప్‌ల వివరాలను వెల్లడించింది.

ఇందులో మై బ్యూటీ ప్లస్‌ మీ- పర్‌ఫెక్ట్‌ కెమెరా యాప్‌ అగ్రస్థానంలో నిలవగా .. వూట్‌ టీవీ షోస్‌ మూవీస్‌ కార్టూన్స్‌ యాప్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. గూగుల్‌ డ్యూయో, మిస్టర్‌ వూనిక్‌, ఎమోజీ కీ బోర్డు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

టాప్‌ 5 గేమ్స్‌ జాబితా 
* ట్రైన్‌ సిమ్యులేటర్‌ 
* సుల్తాన్‌-ద గేమ్‌ 
* ట్రాఫిక్‌ రైడర్‌ 
* టాకింగ్‌ టామ్‌ గోల్డ్‌ రన్‌ 
* గ్రాండ్‌ గ్యాంగ్‌స్టర్స్‌ 3డీ
టాప్‌ 5 సినిమాలు
* ద మార్షియన్‌
* సుల్తాన్‌
* ద జంగిల్‌ బుక్‌
* ద ఇంటర్న్‌
* డెడ్‌పూల్‌

ప్రపంచ వ్యాప్తంగా యాప్స్‌లో ఫేస్‌ ఛేంజర్‌-2 తొలి స్థానంలో నిలవగా గేమ్స్‌లో ఈ ఏడాది సంచలనం సృష్టించిన పోక్‌మెన్‌ గో అగ్రస్థానంలో నిలిచింది. ఇక సినిమాల విభాగంలో డెడ్‌పూల్‌ తొలి స్థానంలో, స్టార్‌ వార్స్‌: ద ఫోర్స్‌ అవేకన్‌ ద్వితీయ స్థానంలో నిలిచాయి.టీవీ షోస్‌లో గేమ్‌ ఆఫ్‌ థోన్స్‌ టాప్‌లో నిలిచింది.

No comments:

Post a Comment