దిల్లీ: నగదు లావాదేవీల నిర్వహణ కష్టం.. ఖర్చుతో కూడుకున్నది.. అందుకే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసి ఇవాళ్టికి నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. రూ.500, 1000 నోట్ల రద్దు తర్వాత 20శాతం నుంచి 40శాతం వరకు నగదు రహిత లావాదేవీలు పెరిగాయని తెలిపారు. నగదు రహిత లావాదేవీల పెంపునకు 11 సూత్రాలు రూపొందించినట్లు చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులు కార్డులతో కొనుగోలు చేసే వారికి 0.75శాతం రాయితీ ఇస్తామని తెలిపారు. 10వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు 2 పీవోఎస్ యంత్రాలు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం నగదును అన్ని ప్రాంతాలకు ఆర్‌బీఐ సరఫరా చేస్తోందని వెల్లడించారు.
సబర్బన్ రైళ్లలో నెల, ఏడాది సీజనల్ టిక్కెట్లు కొనుగోలు చేసే వారికి రాయితీ ఇస్తామని, రైల్వేలో ఇప్పటి వరకు 58 శాతం మంది ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి రూ.10లక్షల బీమా సదుపాయం కల్పించినట్లు చెప్పారు. డిజిటల్ లావాదేవీలతో రైల్వే క్యాటరింగ్, వసతి సౌకర్యం కోసం బుక్ చేస్తే 5శాతం, ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తే 10శాతం ఇస్తామని తెలిపారు. జనవరి 1 నుంచి ముంబయి సబర్బన్ రైళ్లలో రాయితీ విధానం అమల్లోకి వస్తుందనిజైట్లీ పేర్కొన్నారు.
No comments:
Post a Comment