దిల్లీ: క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త! పెద్దనోట్ల రద్దు అనంతరం దేశంలో నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలను మళ్లించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా రూ.2వేలలోపు జరిపే లావాదేవీలపై సేవాపన్ను ఎత్తివేయాలని కేంద్రం యోచిస్తోంది. దీనిపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌లో నోటిఫికేషన్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఇప్పటి వరకు ఇటువంటి మొత్తాలపై 15శాతం సేవాపన్నుగా చెల్లిస్తున్నాం. ఇకపై ఈ మొత్తాలపై పన్ను మినహాయింపు వెసులుబాటును కల్పించనున్నారు. 2012 జూన్‌లో విడుదల చేసిన సేవా పన్ను నోటిఫికేషన్‌ను ఇందుకోసం సవరించనున్నట్లు అధికారవర్గాల సమాచారం.
No comments:
Post a Comment