Saturday, 3 December 2016

ఐప్యాడ్‌, ఐఫోన్‌ల్లో లోపాన్ని గుర్తించిన భారతీయుడు


న్యూయార్క్‌: కేరళకు చెందిన హేమంత్‌ జోసెఫ్‌ అనే వ్యక్తి ఆపిల్‌ సంస్థ ఉత్పత్తులైన ఐప్యాడ్‌, ఐఫోన్‌ల్లో లోపాన్ని గుర్తించారు. ఐఓఎస్‌ 10.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఉత్పత్తుల సెటప్‌ క్రమంలో చిన్న చిట్కా ఉపయోగించడం ద్వారా ఆపిల్‌ ఆక్టివేషన్‌ లాక్‌ను అధిగమించొచ్చని ఆయన నిరూపించారు. వైఫై నెట్‌వర్క్‌ ఎంచుకోమని కోరినప్పుడు పేరు, డబ్ల్యూపీఏ-2 కీలను వేలాది అక్షరాలతో నింపడం ద్వారా పరికరాన్ని స్తంభిపంజేయొచ్చని.. అప్పుడు లాక్‌ మీటను నొక్కడం ద్వారా హోం స్క్రీన్‌కు చేరుకోవచ్చని జోసెఫ్‌ తెలిపారు. అది కాసేపే క్రియాశీలంగా ఉంటుందని.. స్లీప్‌, వేక్‌ మీట ద్వారా దాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఆపిల్‌ స్మార్ట్‌ కవర్‌ను ఉపయోగించడం ద్వారా దీన్ని సులభంగా చేయొచ్చని వివరించారు. ఈ లోపాన్ని సవరించి ఆపిల్‌ సంస్థ గత నెలలో ఐఓఎస్‌ అప్‌డేట్‌ విడుదల చేసినట్లు సమాచారం. మరోవైపు ఐఓఎస్‌ 10.1.1లోనూ అమెరికాలోని పరిశోధకులు లోపాన్ని గుర్తించారు. జోసెఫ్‌ విధానాన్నే అనుసరించిన వారు.. పరికరాన్ని తిప్పడం (రొటేషన్‌) ద్వారా హోం స్క్రీన్‌కు చేరుకోగలిగారు.

No comments:

Post a Comment