Thursday, 8 December 2016

ఆశపడితే ఆపదే!

Be careful while opening unknown links/sites
ఈ లింక్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే... ఏడాదంతా రీఛార్జింగ్‌ ఉచితం... 
ఈ సందేశాన్ని (మెసేజ్‌) అన్ని గ్రూప్‌లకూ పంపితే...రూ.40కే ఫోన్‌... 
..ఫలానా సర్వీస్‌ కొత్తగా ఈ వీడియోకాలింగ్‌ మొదలెట్టింది... కింది లింక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి....
టీవల కాలంలో తరచూ అందరి ఫోన్లలో కన్పిస్తున్న సందేశాలు ఇవి! ఆశతో వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు సైబర్‌ నిపుణులు. తాజాగా ప్రభుత్వం నగదు రహిత పద్ధతిలో భాగంగా... ఫోన్‌, మొబైల్‌, కార్డుల ద్వారా లావాదేవీలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో సైబర్‌ నేరాల విషయంలో మరింత జాగరూకత వహించాల్సిన అవసరం ఉంది. అంతర్జాలంలో లభ్యమవుతున్న అప్లికేషన్ల (యాప్‌లు)తో సౌకర్యాలెంతగా ఉన్నాయో... ప్రమాదాలూ అంతేస్థాయిలో పొంచి ఉన్నాయి.
‘‘సురక్షితం కాని లింకులను ఫోన్‌/డెస్క్‌టాప్‌లో పొందుపరచుకుంటే మీ ఫోన్లో కీలాగర్స్‌ ఇన్‌స్టాల్‌ అవుతాయి. అప్పుడు మీరు మీ ఫోన్‌ ద్వారా చేసే కార్యకలాపాలన్నీ హ్యాకర్‌కు చేరతాయి. మీ కాల్‌ రికార్డు; ఎస్‌ఎంఎస్‌లు, మీరు తీసిన ఫొటోలు...తదితర సమాచారమంతా (డేటా) హ్యాకర్‌కు చేరుకుంటుంది. బ్యాంకుల్లో కేవైసీ ఉండగానే అనేక నకిలీ ఖాతాలుంటున్నాయి. నైజీరియా బృందాల మోసాలూ తెలిసిందే. బ్యాంకు ఖాతాల పరిస్థితే ఇలా ఉంటే.. ఆన్‌లైన్‌ లావాదేవీల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి’’ అని ఇండియన్‌ సర్వర్‌ సీఈవో, సైబర్‌ భద్రత నిపుణులు సాయి సతీశ్‌ తెలిపారు. అందుకే ఆన్‌లైన్‌ ద్వారా జరిపే లావాదేవీలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు.

No comments:

Post a Comment