Thursday, 1 December 2016

Reliance Jio Happy New Year offer, All services free till March 31st 2017


Reliance Jio Happy New Year offer, All services free till March 31st 2017


Reliance Industries Chairman Mukesh Ambani said that the free services under Reliance Jio Welcome Offer have been extended till March 31 as part of its Jio Happy New Year Offer, among other announcements related to the telecom venture.
"Starting December 4, 2016, every new Jio user will get the data, voice, and full bouquet of the Jio apps free till 31 March 2017.


 Mukesh Ambani said about the Reliance Jio extended Welcome Offer. "This is the Jio Happy New Year Offer. All our existing 52 million users will continue to enjoy the Welcome Offer till 31 December, and then automatically be signed up for the New Year Offer. No need to buy a new SIM."

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ కంటే వేగంగా జియో అభివృద్ధి చెందుతోందని రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తెలిపారు. అత్యంత వేగంగా సాంకేతికతను అందించే సంస్థగా జియో నిలవడం గర్వకారణమని.. ఇది తమ ఖాతాదారుల విజయమని పేర్కొన్నారు. జియోను ఆదరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని.. వీరి కోసం వచ్చే ఏడాది మార్చి 31 వరకు జియో అన్ని సేవలు పూర్తి ఉచితంగా అందించనున్నట్లు అంబానీ తెలిపారు. జియో ‘న్యూ ఇయర్‌ ఆఫర్‌’ పేరుతో ఈ సేవలను పొడిగిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 31 నుంచి వంద నగరాల్లో ఇంటికే జియో సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.



ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 డిజిటల్‌ దేశాల్లో భారత్‌ ఒకటి.
* గడిచిన మూడు నెలలుగా రోజుకు 6లక్షల మంది చొప్పున జియోలో చేరారు.
* కాగిత రహిత సమాజం కోసమే జియోను తీసుకొచ్చాం. ఇతర నెట్‌వర్క్‌ కంటే జియో 25రెట్లు వేగంగా పనిచేస్తుంది.
* జియో అత్యధిక వేగంగా 5 కోట్ల మంది వినియోగదారులను చేరుకోవడం సంతోషంగా ఉంది.
* సలహాలు, సూచనలు స్వీకరించేందుకే లాంచింగ్‌ ఆఫర్‌ ఇచ్చాం.
* ఈ-కేవైసీ ద్వారా జియో సిమ్‌ కేవలం ఐదు నిమిషాల్లోనే యాక్టివేట్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉచిత కాల్స్‌ సదుపాయాన్ని కొనసాగిస్తాం.
* వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడమే మా లక్ష్యం.
* ఇప్పటివరకూ 9కోట్ల జియో వాయిస్‌ కాల్స్‌ను ఇతర ఆపరేటర్లు బ్లాక్‌ చేశారు.
* ఇక నుంచి వినియోగదారులకు నంబర్‌ పోర్టబులిటీని సదుపాయం అందిస్తాం.
* పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీని అభినందిస్తున్నా. దేశంలో పారదర్శకత పెంపొందించేందుకు ఈ చర్య ఎంతో ఉపకరిస్తుంది.
ఇక ముందు ప్రయాణ టిక్కెట్లు సహా ఇతర సేవల కోసం క్యూలో నిలబడి ఉండాల్సిన అవసరం ఉండదు.
* డిజిటల్‌ ఎకానమీతో దేశం మరింత ముందుకు వెళ్తుంది.
డిసెంబరు 5వ తేదీ నుంచి రిలయన్స్‌ జియో మనీ మర్చంట్‌ అప్లికేషన్‌ను ప్రవేశపెడుతున్నాం. దేశవ్యాప్తంగా 10 మిలియన్ల మంది వ్యాపారులు ఈ మనీ మర్చంట్‌ యాప్‌కు చేరువ కావాలన్నది మా లక్ష్యం.
* ప్రతి ఒక్కరి చేతుల్లో డిజిటల్‌ ఏటీఎం ఉండాలని భావిస్తున్నాం. ఆధార్‌ అనుసంధానంతో జియో డిజిటల్‌ ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చు.
వ్యాపారులందరూ జియో మర్చంట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని దాని ద్వారా చెల్లింపులు, నగదు లావాదేవీలు జరుపుకోవచ్చు.
* జియో ఆఫర్‌ను పొడిగించడం వల్ల సామాన్య ప్రజలకు పెద్ద లాభదాయకం కానుందని ఆశిస్తున్నాం.
జియో మనీతో ప్రతి భారతీయుడు డిజిటల్‌ వ్యాలెట్‌ను పొందుతాడు.

No comments:

Post a Comment