Monday, 5 December 2016

డిసెంబర్‌ 9న మార్కెట్లోకి ‘కొడక్‌ ఏక్‌త్రా’

స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక కెమెరాల వాడకం తగ్గింది. ఫోన్‌తోనే నాణ్యమైన చిత్రాలు తీసే వెసులుబాటు ఉండటంతో వినియోగదారులు దాదాపుగా స్మార్ట్‌ఫోన్స్‌నే ఉపయోగించేందుకు అలవాటు పడ్డారు. కానీ ఫోటోగ్రఫీ ప్రియుల కోసం హై ఎండ్‌ కెమెరాలతో కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌ వచ్చాయి. ఇప్పుడు తాజాగా కొడక్‌ కంపెనీ ఏక్‌త్రా పేరుతో ఓ మొబైల్‌ను విడుదల చేయబోతోంది. ఈ ఫోన్‌ ద్వారా ఇంచుమించు డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరా నాణ్యతతో ఫోటోలను తీయొచ్చు. డిసెంబర్‌ 9న జర్మనీ మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఈ మొబైల్‌ అమెజాన్‌, కొడక్‌ఫోన్స్‌.కామ్‌ సైట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్‌ ధర 499 యూరోలు(రూ.36,000).ఏకత్రా ఫోన్‌లో కెమెరానే ప్రత్యేక ఆకర్షణ. 21 ఎంపీ ఆటో ఫోకస్‌ కెమెరా, డ్యూయల్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో అత్యంత నాణ్యమైన ఫోటోలు తీయొచ్చని కంపెనీ చెబుతోంది. డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాలో ఉండే స్మార్ట్‌ ఆటో, పనోరమ, మ్యాక్రో వంటి పలు ఆప్షన్లను ఉపయోగించి సందర్భానుసారంగా కెమెరా సెట్టింగ్స్‌ మార్చుకోవచ్చు. 4కే రిజల్యూషన్‌ వీడియో సైతం చిత్రీకరించే సౌలభ్యం ఉంది. 13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ద్వారా సెల్ఫీలు, వీడియో ఛాటింగ్‌ మరింత క్వాలిటీతో ఉంటాయి.
ఫోన్‌ ఫీచర్స్‌... 
5 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే 
3 జీబీ రామ్‌, 2.3 హెలియో ఎక్స్‌ 20 డెకా కోర్‌ ప్రాసెసర్‌
32 జీబీ అంతర్గత మెమొరీ 
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments:

Post a Comment