దిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు డెబిట్ కార్డులపై మరింత నియంత్రణ కల్పించేందుకు సరికొత్త సేవలు ప్రవేశపెట్టింది. ‘ఏటీఎం కార్డు స్విచ్ ఆన్/ఆఫ్’ పేరిట ప్రవేశపెట్టిన ఈ సేవలతో ఇక వినియోగదారుడు తన డెబిట్ కార్డును బ్యాంకు మొబైల్ యాప్ ‘ఎస్‌బీఐ క్విక్’ నుంచే నియంత్రించవచ్చు.
ఉదాహరణకు ఒక వినియోగదారుడు ఎస్‌బీఐ క్విక్ యాప్‌ను రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉన్న ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకొని అందులో ‘పాయింట్ ఆఫ్ సేల్’ టర్న్ ఆఫ్ ఆప్షన్‌ను ఎంచుకుంటే ఇక అతని ఏటీఎం కార్డు ద్వారా షాపింగ్ మాల్స్, , రిటైల్ స్టోర్లు, పెట్రోల్‌బంకులు తదితర ప్రాంతాల్లో పేమెంట్ చేయడం కుదరదు. ఇదే విధంగా ఈ-కామర్స్ ఆప్షన్‌ను టర్న్ ఆఫ్ చేసుకుంటే ఇక ఆ కార్డుతో ఎలాంటి ఆన్‌లైన్ లావాదేవీలు చేపట్టడం వీలు కాదు. మళ్లీ కావాల్సినప్పుడు వినియోగదారుడు ఆ ఆప్షన్లను టర్న్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. వినియోగదారుల అవసరాలను బట్టి జాతీయ, అంతర్జాతీయ సేవలపై నియంత్రణను విధించుకోవచ్చు.
ఎస్‌బీఐ వివరాల ప్రకారం ‘ఎస్‌బీఐ క్విక్’ యాప్‌కోసం 70 లక్షలకుపైగా వినియోగదారులు రిజిస్టర్ చేసుకున్నారని.. వీరిలో 19 లక్షల మంది యాప్ ద్వారా సేవలను పొందుతున్నారని..మిగతావారు డైరెక్ట్ ఎస్‌ఎంఎస్, మిస్డ్ కాల్ సేవలను వినియోగించుకుంటున్నారని అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment