న్యూదిల్లీ: రిలయన్స్ జియో పత్రికా ప్రకటనల్లో ఎలాంటి అనుమతి లేకుండా ప్రధాని ఫొటో ముద్రించినందుకు జరిమానా విధించారు. అయితే.. ఆ జరిమానా ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. కేవలం రూ.500 మాత్రమే జరిమానా విధించారు. చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించి ఉన్నత స్థాయి వ్యక్తుల ఫొటోలను ముద్రించినందుకు ఇంతే జరిమానా విధించాలని అందులో ఉందట. ఇదే విషయాన్ని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ పార్లమెంట్‌లో లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు.
గురువారం పార్లమెంట్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేత నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు మంత్రి రాజ్యవర్థన్ సింగ్ పైవిధింగా సమాధానమిచ్చారు. జియో ప్రకటనలో ప్రధాని ఫొటోను వినియోగించుకునేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పేటీఎం కూడా మోదీ ఫొటోను పత్రికల్లో వినియోగించిందని నీరజ్ లేవనెత్తిన ప్రశ్నకు రాజ్యవర్థన్ స్పందిస్తూ.. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, నిబంధనలు ఉల్లంఘించి ఇలా చేసేవారిపై చర్యలు ఉంటాయని సమాధానమిచ్చారు.
No comments:
Post a Comment