ప్రగతే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నాం
ఈసారి ఆ తప్పులకు ఆస్కారమివ్వను
రెండు నగరాలు నిర్మించే అరుదైన అవకాశం వచ్చింది
తెలంగాణ సీఎంతో సత్సంబంధాలు
హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో సీఎం చంద్రబాబు
గతంలో నన్ను ఎవ్వరూ ఓడించలేదు. నా చర్యల వల్లే కొన్ని సమస్యలు వచ్చాయి. గత అనుభవ పాఠాలతో నన్ను నేను సరిదిద్దుకుని భవిష్యత్తుకు పక్కా ప్రణాళిక రూపొందించుకుంటున్నా. తెలంగాణ సీఎంతో సంబంధాలు బాగున్నాయి. మీకు బాగా తెలుసు. ఆయన ఒకప్పుడు మా సహచరుడు. మా పార్టీలో కూడా ఉన్నారు. సాధ్యమైనచోట పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటున్నాం.

‘‘ వచ్చే ఎన్నికల్లో మళ్లీ భాజపాతో కలిసి పోటీ చేస్తారా అన్న సందేహం ఇప్పుడు ఎందుకు? మంచి ఉద్దేశంతో కలిసి పోటీ చేశాం. మా మధ్య సత్సంబంధాలున్నాయి.’’
‘‘ఇప్పుడు మాకు అమరావతి రాజధాని నిర్మించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రజలకు ఒక పిలుపు ఇస్తే భూసమీకరణలో రూ.40 వేల కోట్ల విలువైన భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇది చాలా అరుదైన అవకాశం. 21వ శతాబ్దంలో నిజమైన స్మార్ట్‌సిటీని నిర్మించబోతున్నాం.’’
‘‘జీవితంలో రెండునగరాలు నిర్మించే అవకాశం రావడం సంతోషకరం. ఆంధ్రలో అద్భుతమైన మానవ వనరులున్నాయి. వీటికి తోడు మా పరిపాలన. మేం రియల్‌టైం పాలనపై దృష్టి పెట్టాం. సులభతర వ్యాపార నిర్వహణలో ఈసారి మేం సోదర రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం..’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. శనివారం ఇక్కడ జరిగిన హిందుస్థాన్‌టైమ్స్ నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ పత్రిక ముఖ్యసంపాదకుడు బాబీఘోష్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అమరావతి నిర్మాణంలో ఉన్న ఇబ్బందులు, సోదర రాష్ట్రం తెలంగాణ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మిత్రపక్షం భాజపాతో నెలకొన్న సంబంధాలు, పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చంద్రబాబు తన మనసులోని మాటను బయటపెట్టారు. దేశ, విదేశాలకు చెందిన విభిన్న రంగాలకు చెందిన 21 మంది నాయకులు పాల్గొన్న ఈ సదస్సు రెండోరోజు చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎదురైన ప్రశ్నలు... వ్యక్తం చేసిన సమాధానాలు ఇలా ఉన్నాయి...
భాజపాతో సంబంధాలపై
మేం ముందస్తు పొత్తుతో ఎన్నికలకు వెళ్లాం. కేంద్ర మంత్రివర్గంలో మా మంత్రులు, రాష్ట్ర మంత్రివర్గంలో భాజపా మంత్రులున్నారు. ఇద్దరూ కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్రానికి సాయం అన్నది నిరంతర ప్రక్రియ. విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు. పార్లమెంటు వేదికగానూ కొన్ని వాగ్దానాలు చేశారు. అందులో కొన్ని అమలు చేశారు. మరికొన్ని అమలు చేయాల్సి ఉంది. సమస్యకు తార్కిక ముగింపు పలకాల్సి ఉంది.

పెద్దనోట్ల రద్దు... తదనంతర పరిణామాలపై
కరెన్సీ కారణంగా అన్నిచోట్లా ఇది సమస్యగా ఉంది. గత 24 రోజుల నుంచి నేను దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నా. ఇబ్బందులను తగ్గించాలి. గత రెండేళ్లుగా పోస్ మిషన్లు ఉపయోగించి పీడీఎస్, పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. ఆ అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతోంది. ఇప్పటివరకు కేంద్రం నా సలహా అడగలేదు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకోసం ఏర్పాటు చేసిన కమిటీకి వాళ్లు నన్ను కన్వీనర్‌గా చేశారు. ఇటీవల కమిటీ సభ్యులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాను. త్వరలో అందరూ సమావేశమవుతాం.

విజయవాడ, విశాఖ వంటి పెద్దనగరాలున్నా అమరావతి ఎందుకు?
ఈరోజుల్లో నగరాలే ఎక్కువ జీఎస్‌డీపీ, ఉపాధి, ఆర్థిక వాతావరణాన్ని సమకూరుస్తున్నాయి. ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌పై ఈ ప్రయోగం చేశాం. అక్కడ మేథో ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లాం. తొమ్మిదేళ్లలో హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు సైబరాబాద్ నగరాన్ని జత Œచేశాం. ఇప్పుడు హైదరాబాద్ అత్యుత్తమ నగరంగా మారింది. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తికావాలంటే నేను అన్ని ఎన్నికల్లో నిరంతరం గెలవాలి. గతంలో మంచి ప్రయోగం చేశాం. నేను ఆనాడు కాలం కంటే ముందుకెళ్లినట్లు కొందరు సన్నిహితులు నాతో చెప్పారు. ఈసారి అన్నింటినీ సమతౌల్యం చేసుకోవాలి. ప్రజల స్వల్పకాల, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతౌల్యం చేసుకుంటూ ప్రజలను ఎప్పుడూ నావైపు ఉండేలా చూసుకోవాలి. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య అమరావతి వస్తోంది. మరోవైపు తెనాలి ఉంది. 25 లక్షలమంది ఇప్పటికే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కలుపుతున్నాం.

తెలంగాణ ప్రభుత్వంతో సంబంధాలు, సమస్యలు
నాకు ఎవరితో ఎలాంటి సమస్యలు లేవు. విభజన తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరించుకోవాల్సింది. ఎక్కడ వివాదం ఉన్నా ఇద్దరూ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలి. లేకపోతే మనం సమయం కోల్పోతాం. అందుకే సాధ్యమైనచోటల్లా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. రాష్ట్ర విభజన ముగిసిన అంశం. మెరుగైన పరిస్థితులు, సౌభాగ్యం కోసం రెండు రాష్ట్రాలు ముందడుగు వేయాలి. అంతా తెలుగుమాట్లాడేవారే. మాకు నౌకాశ్రయాల బలం ఉంది. వారు వాటిని ఉపయోగించుకోవాలి. హైదరాబాద్, తెలంగాణకు కొన్ని బలాలున్నాయి. వాటిని మేం ఉపయోగించుకోవాలి.

No comments:
Post a Comment