ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ తన వినియోగదారుల కోసంమరో రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఒకటి వీడియో స్ట్రీమింగ్ సదుపాయం కాగా.. రెండోది జిఫ్ ఫార్మాట్ చిత్రాలను పంపించుకునే వెసులుబాటు. ఇంతకుముందు బీటా వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయాలు అందుబాటులో ఉండేవి.
ఇప్పటి వరకు ఎవరైనా పంపిన వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని ప్లే చేసుకునే వెసులుబాటు మాత్రమే ఉండేది. తాజాగా వచ్చిన ఫీచర్ ద్వారా ఇకపై వీడియోను నేరుగా ప్లే చేయొచ్చు. లేదనుకుంటే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటునూ వాట్సాప్ అందిస్తోంది.
వాట్సాప్ రెండో సదుపాయంతో ఇకపై 6 సెకండ్ల నిడివి గల వీడియోను జిఫ్ ఫార్మాట్ రూపంలో పంపించుకోవచ్చు. పంపించే ముందు వాటిని మనకు కావాల్సిన సైజ్‌లో క్రాప్ చేసుకునే అవకాశమూ ఉంది. ఇతరులు పంపిన ఇటువంటి చిత్రాలు నేరుగా ఫోన్‌లో వాట్సాప్ డైరెక్టరీలోని యానిమేటెడ్ జిఫ్ ఇమేజెస్ ఫోల్డర్‌లో నిక్షిప్తమవుతాయి. ఈ రెండు సదుపాయాలను వాట్సాప్ తాజా అప్‌డేట్‌లో అందుబాటులోకి తెచ్చింది.
No comments:
Post a Comment