Tuesday, 13 December 2016

కొవ్వు తగ్గించే అల్పాహారం

చాలామంది అమ్మాయిలు ఆలస్యంగా
చాలామంది లస్యంగా నిద్రపోతారు. ఏ పొద్దెక్కాకో మేల్కొంటారు. దాంతో ఉదయంపూట అల్పాహారం తీసుకోకుండా.. ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేస్తారు. దీనివల్ల ఎదురయ్యే మొదటి సమస్య బరువు పెరగడం. అందుకే పొద్దున్నే అల్పాహారం తినాలి.. అందులోనూ కొవ్వు కరిగించే పదార్థాలనూ ఎంచుకోవాలి. 



రాగి జావ మనకి చాలా మంచిది. ఇందులో ఇనుము, క్యాల్షియం ఎక్కువ. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండటమే కాదు, రక్తహీనతా దూరమవుతుంది. ఇందులో బెల్లం, యాలకులతోపాటు. వెన్నలేని పాలు కూడా వేసుకోవచ్చు. బాగా మగ్గిన పండ్ల ముక్కలు కూడా వేసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల త్వరగా ఆకలీ వేయదు.


ఉదయాన్నే పీచు సమృద్ధిగా లభించే ఓట్స్‌ తింటే బరువు తగ్గడమే కాదు, ఆరోగ్యానికీ మంచిది. దాన్ని వెన్నలేని పాలతో చేసుకోవాలి. అప్పుడే కెలొరీలు కరుగుతాయి. అందులో అరటిపండు ముక్కలూ, కొన్ని ఎండు ద్రాక్ష పలుకులూ, నానబెట్టి పొట్టుతీసిన బాదం గింజలు వేసుకోవచ్చు. బలానికి బలం.. ఆరోగ్యానికి మంచిది.

మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్లు, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికం. వీటిని ఉదయం తీసుకుంటే శరీరానికి శక్తి అందుతుంది. కొవ్వు తగ్గి, కెలొరీలూ ఖర్చవుతాయి. అలాగే పొద్దుటి పూట పెరుగూ, పాల పదార్థాలూ, పండ్లను కలిపి గుజ్జులా (స్మూతీ) చేసుకుని పైన ఎండు ఫలాలు లేదంటే.. వాల్‌నట్‌, బాదం పలుకులు వేసుకుని తినాలి. రోజంతా చురుగ్గా ఉంటారు.

No comments:

Post a Comment