ఉద్యోగ భవిష్య నిధి... పేరుకు తగ్గట్టే.. భవిష్యత్తుకు భరోసా కల్పించే ఓ నమ్మకమైన పథకం. ఉద్యోగంలో ఉన్నప్పుడు పన్ను ఆదా కోసం.. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించే పథకంగానూ ఎంతో పేరు పొందింది. దాదాపు 64ఏళ్ల నుంచీ ఎంతోమంది తమ మలి జీవిత అవసరం కోసం ఇదొక్కటి చాలు...అన్నట్లు భావిస్తుంటారు. కానీ, తగ్గుతున్న వడ్డీ రేట్లతో సుమారు 6.38కోట్ల మంది ఈ భరోసా తగ్గుతోందా అనే ఆందోళనలో పడిపోయారు.
ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులందరికీ సుపరిచితమైన పదం ఈపీఎఫ్ (ఉద్యోగుల భవిష్య నిధి). నిర్ణీత సంఖ్యలో ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థా తప్పనిసరిగా ఈపీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాల్సిందే. ఈపీఎఫ్ వర్తించే ఉద్యోగులందరికీ వారి మూల వేతనంలో నుంచి 12శాతాన్ని ఆ ఖాతాలో జమ చేస్తారు. అదే శాతంలో యాజమాన్యమూ జమ చేస్తుంది. ఇది దీర్ఘకాలంపాటు క్రమశిక్షణతో పాటు సాగే ఒక పొదుపు పథకం. గత కొంతకాలంగా ఈ పథకంపై వచ్చే వడ్డీ తగ్గుతూ వస్తోంది. తాజాగా ఈపీఎఫ్‌ఓ 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఈ వడ్డీ రేటును 8.8శాతం నుంచి 8.65 శాతానికి తగ్గించింది. దీంతో ఇది భవిష్యత్తులో ఇంకా తగ్గనుందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ పెట్టుబడి పథకాలవైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి.
ఎందుకు తగ్గిస్తున్నారు?
ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు అనేక అంశాలు, కారణాలు ఉంటాయి. ఇక ప్రస్తుత పరిస్థితులనే తీసుకుంటే.. దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. ప్రభుత్వ 10ఏళ్ల బాండ్ల రాబడి రేటు ఏడుశాతం కన్నా తక్కువగానే వస్తోంది. పైగా పాత పెద్ద నోట్ల ఉపసంహరణతో లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల వద్ద ఉన్నాయి. ప్రత్యామ్నాయ పెట్టుబడులు ఇచ్చే రాబడి కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ఇతర అన్ని సురక్షిత పొదుపు పథకాలపై వస్తున్న వడ్డీ రేట్లు తగ్గడం ప్రారంభించాయి. మన ఆర్థిక వ్యవస్థ నిదానంగా స్వల్ప వడ్డీ రేట్లకు అలవాటు పడే దిశలో ఉంది. రానున్న రెండుమూడేళ్లలో వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం లేకపోలేదు. 8.8శాతం వడ్డీతో 2015-16లో రూ.409కోట్ల మిగులు సాధించిన ఈపీఎఫ్‌ఓ ఇదే వడ్డీ శాతంతో రూ.383కోట్ల లోటు వస్తుందంటోంది. వీటన్నింటినీ విశ్లేషిస్తే ప్రస్తుతం ఈపీఎఫ్‌పై వడ్డీ రేటులో 0.15% మాత్రమే కోత కోయడం కొంతలో కొంత నయమే అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ఈటీఎఫ్‌లలో మదుపు చేస్తున్నా...
భవిష్య నిధి మొత్తంపై రాబడిని పెంచుకోవాలన్న లక్ష్యంతో ఇందులో నుంచి గరిష్ఠంగా 15శాతం వరకూ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో (ఈటీఎఫ్)మదుపు చేయాలని నిర్ణయించారు. దీర్ఘకాలంలో ఇందులో మంచి లాభాలు వస్తాయనీ, తద్వారా ఖాతాదారులకు వడ్డీ కోత లేకుండా చూడటమే దీని ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు. అయితే, గణాంకాలను పరిశీలిస్తే.. ఈటీఎఫ్‌లో పెట్టుబడికి సగటున 10శాతం వరకూ రాబడిని అనుకోవచ్చు. అంటే రూ.15 పెట్టుబడి పెడితే.. రూ.1.5 వస్తుంది. 85శాతం మొత్తం ప్రభుత్వ బాండ్లలో దాదాపు 7శాతం లోపే రాబడిని ఆర్జిస్తోంది. అంటే.. రూ.5.9 వరకూ వస్తుంది. అంటే.. మొత్తంగా చూస్తే.. 7.4-8శాతం లోపే వార్షిక రాబడిని ఆర్జిస్తోంది. అందుకే, రూ.383 కోట్ల వరకూ లోటు కనిపిస్తోందని ఈ లెక్కన మున్ముందు మరింత వడ్డీ రేట్ల కోతకు ఈపీఎఫ్ సభ్యులు సిద్ధం కావాల్సిందేనా అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. గతంలో ప్రజా భవిష్య నిధి, ఈపీఎఫ్ వడ్డీ రేట్లు సమానంగా ఉండేవి. కానీ, ఇప్పుడు పీపీఎఫ్ వడ్డీ రేటు 8శాతమే. దీంతో సమానంగా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, రాజకీయ కారణాలు, ఎన్నికల నేపథ్యంలో అంత తొందరగా వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చు. కానీ, రానున్న రోజుల్లో వడ్డీ రేట్ల కోతకు సిద్ధపడాల్సిందే అంటున్నారు వ్యక్తిగత ఆర్థిక నిపుణులు.

నష్టం తక్కువేమీ కాదు..
ప్రస్తుతం ఎక్కడ చూసినా వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. బ్యాంకులు గరిష్ఠంగా 7.25శాతానికి మించి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో నమ్మకమైన పెట్టుబడి సాధనంగా, కాస్త అధిక రాబడి ఇచ్చే వాటిలో ఈపీఎఫ్ ముందు వరుసలో ఉంది. అందుకే, చాలామంది ఇప్పటికీ స్వచ్ఛంద భవిష్య నిధి (వీపీఎఫ్)లోనూ పొదుపు చేస్తుంటారు. అయితే, పీఎఫ్ వడ్డీ రేటును క్రమక్రమంగా తగ్గించడం ఒక విధంగా వీరందిరికీ నిరాశే అని చెప్పుకోవచ్చు. వడ్డీ రేటు కోతతో ఎంత నష్టం అని చూడటానికి ఓ ఉదాహరణ పరిశీలిద్దాం! 35 ఏళ్ల వ్యక్తి.. 58ఏళ్లకు పదవీ విరమణ చేస్తాడనుకుందాం. ప్రస్తుతం అతని పీఎఫ్ ఖాతాలో రూ.6లక్షలు ఉన్నాయి. ఇక ప్రతి నెలా రూ.6వేలు (ఉద్యోగి, ఉద్యోగ సంస్థవి కలిపి, పింఛను నిధికి పోను మిగిలినవి) ఈపీఎఫ్‌లో జమ అవుతాయనుకుందాం. అప్పుడు ఇప్పటివరకూ ఉన్న 8.8శాతం వడ్డీతో దాదాపు రూ.98,75,481 అయ్యేందుకు అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం తగ్గించిన వడ్డీ 8.65%తో లెక్కిస్తే సుమారు రూ.96,04,028 అవుతాయి. అంటే.. దాదాపు రూ.2,71,543 తగ్గుతాయన్నమాట. (ఇది ప్రస్తుత పరిస్థితుల్లో అంచనా). భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గుతూ ఉంటే.. ఉద్యోగులకు అంతిమంగా సమకూరే నిధికూడా తరుగుతుంది.

అయినా వదులుకోవద్దు
ఈపీఎఫ్ వడ్డీ తగ్గుతుండటం బాధ కల్గించే విషయమే అయినప్పటికీ.. ఇందులో నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకొని వేరే చోట మదుపు చేద్దామనుకోవడం మాత్రం సరికాదని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికీ 8.65శాతం అందించే సురక్షిత పథకం ఇదే అని వారంటున్నారు. జమ చేసే మొత్తానికి, వచ్చిన రాబడికీ పన్ను మినహాయింపు ఉండటం ఇందులో కలిసొచ్చే అంశంగా చూడాలి. ఉదాహరణకు 30శాతం పన్ను శ్లాబులో ఉన్నవారికి దాదాపు 12శాతంకన్నా అధికంగానే రాబడి గిట్టుబాటు అవుతుంది. 20శాతం శ్లాబులో ఉంటే.. 10.7శాతం; 10శాతం శ్లాబులో వారికి 9.3శాతం వరకూ నికర రాబడి వస్తుంది. కాబట్టి, అనవసరంగా ఈ నిధిని కదపకూడదు.

ఎన్‌పీఎస్ కోసమేనా?
కొన్నేళ్లుగా సురక్షిత పెట్టుబడి సాధనం ఈపీఎఫ్‌కు ఉద్యోగులు అలవాటు పడ్డారు. దీన్నుంచి జాతీయ పింఛను పథకం వైపు మళ్లేలా చూసేందుకు ప్రభుత్వం కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. 2016 బడ్జెట్‌లో ఈపీఎఫ్ పథకానికి కొన్ని మార్పులు ప్రతిపాదించిందీ ఈ ఉద్దేశంతోనే. కాకపోతే ప్రజాందోళనల నేపథ్యంలో వెనక్కి తగ్గింది. ఇందులో మదుపు చేసిన మొత్తాన్ని ఈక్విటీ, డెట్ పథకాల్లో సొంతంగా నిర్వహించుకోవచ్చు. లేదా ఫండ్ మేనేజర్ల ఇష్టానికి వదిలేయవచ్చు. ఎన్‌పీఎస్ ఖాతాలో జమైన మొత్తాన్ని పదవీ విరమణ అనంతరం 40శాతం ఎలాంటి పన్ను లేకుండా వెనక్కి తీసుకోవచ్చు. 60శాతాన్ని వెంటనే పింఛను ఇచ్చే పథకాలకు కేటాయించాలి. దీర్ఘకాలంలో ప్రభుత్వం తనపై భారం పడకుండా ఉద్యోగులు, ప్రజలను ఈ పింఛను విధానంలోకి మార్చేందుకు వడ్డీ రేట్ల తగ్గింపును అస్త్రంగా వాడుకుంటుందనీ అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

PF interest rate cut down to 8.65 per cent
Nearly 15 crore people subscribed to employees provident fund scheme will earn interest at the rate of 8.65 per cent on their savings in 2016-17. This is the lowest in the last seven years.
The decision was taken at the 215th meeting of the Employees Provident Fund Organisation (EPFO)’s central board of trustees, chaired by Labour Minister Bandaru Dattatreya in Bengaluru on Monday.
Earlier, the EPFO’s income projections showed 8.62 per cent as the feasible interest rate for 2016-17. However, the EPFO trustees decided to fix the interest rate slightly higher at 8.65 per cent following protests by trade union members, sources present at the meeting said.
EPF subscribers got 8.8 per cent rate of interest on their provident fund savings in 2015-16 and 2014-15.
While an interest rate of 8.62 per cent would allow the EPFO to keep a surplus of around Rs 22 crore, fixing the interest rate at the present rate of 8.8 per cent would have left it with a deficit of Rs 700 crore, EPFO’s income projections showed.
According to sources in EPFO, the lower interest rate is on account of poor rate of return on investments made by the EPFO on all fronts.
Even at 8.65 per cent, EPF will deliver better returns than other savings instruments such as small saving schemes. While Public Provident Fund (PPF) offers 8 per cent rate of return, Sukanya Samriddhi Account Scheme (savings scheme for the girl child) gives 8.5 per cent annual return. The interest rate on term deposits is 7-7.8 per cent at present.
No comments:
Post a Comment